Saturday, August 28, 2010

, Vishva maanavudu

                            

                  విశ్వ మానవుడు
    
       విశ్వ మూర్తినినేను, విశ్వ పతి నేను !
       విశ్వ వేద్యుడ నేను, విశ్వమును నేను
      విశ్వాంతరాత్ముడను ,విశ్వ కర్తను నేను
      విశ్వమున వెలుగొందు తేజమును  నేను!
    
      జీవ కోటుల పెక్కు శీర్షముల యందునను
       చేరినా శీర్షంబు గరువమున లేచు
      వేయి గొంతుకలందు,  వేయి చేతుల లొన
      వినిపించు నా  గొంతు , కనిపించు నా చేయి            విశ్వ మూర్తిని నేను .....
    
     తారకల పొదరిండ్ల విరుల తావుల మెచ్చి
     పరమాణు పుంతలో విహరణము సలిపి
     అంతమే లేని ఈ సృష్టి పధముల లోన
    అంతమెరుగని నిత్య యాత్రికుడ నేను                          విశ్వ మూర్తిని నేను ....

     విశ్వ యోచనములో నాయోచనయు కలదు
     విశ్వ నేత్రములతో నేజూచు చుందు
     విశ్వ కళ్యాణమును  వెదకు చుందును నేను
    నా శ్వాస  విశ్వంపు శ్వాస ! నాపేరు విశ్వ మానవుడు
     నాపేరు విశ్వ మానవుడు ,నా .....పేరు ....విశ్వ మానవుడు .........


            

1 comment: